బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

10-03-2020 మంగళవారం మీ రాశిఫలాలు - కార్తికేయుడిని పూజించినా మనోవాంఛలు

మేషం : ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులతో వ్యయం అధికమవుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్ రావడానికి మరికొంత సమయం వేచి ఉండాల్సివస్తుంది. 
 
వృషభం : బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఇతరులపై ఆధారపడక ప్రతి విషయంలో మీరే నిర్ణయం తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. వాహనచోదకులకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. 
 
మిథునం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ప్రియతములరాక సమాచారం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సిమెంట్, స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. ఖర్చులు పెరగడంతో పాటు రుణాలు, చేబదుళ్లు తప్పవు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలివేయకుండా పూర్తిచేయండి. 
 
కర్కాటకం : పత్రిక, ప్రైవేటు సంస్థలోని వారికి ఓర్పు, పనియందు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఎల్.ఐ.సి ఏజెంట్లకు బ్రోకర్లకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం అని గమనించండి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదావేయడం శ్రేయస్కరం. 
 
సింహం : స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. రాజకీయాల్లో వారిక పార్టీపరంగా గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. 
 
కన్య : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకున్నా నెమ్మదిగా సమసిపోతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. స్త్రీలు, ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగస్తుల పనిలో ఒత్తిడి, చికాకులు ఉంటాయి. రావలసిన బకాయిల సకాలంలో అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. 
 
తుల : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ శాఖాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉద్యోగస్తులకు రావలసిన క్రైంలు ఆలస్యంగా ఉందుతాయి. 
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఆర్థికాభివృద్ధి కానవస్తుంది. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటికి అవసరమైన వస్తు సామాగ్రి సమకూర్చుకుంటారు. 
 
ధనస్సు : సన్నిహితులతో గతంలో ఏర్పడిన విభేదాలు నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. 
 
మకరం : బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు టార్గెట్, ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం : స్త్రీలకు ఆకస్మిక ధన, వస్తు, వస్త్రప్రాప్తి వంటి శుభసంకేతాలున్నాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచాలి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ఎన్ని సమస్యలు ఎదురైనా చేపట్టిన ప్రాజెక్టులను పట్టుదలతో పూర్తిచేస్తారు. వృత్తులవారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. 
 
మీనం : అనుక్షణం మీ సంతానం విద్యా ఉద్యోగ విషయాలపై మీ ఆలోచనలు ఉంటాయి. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. పెరిగిన ధరలు, ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.