మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

05-03-2020 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడుని ఆరాధించినా..

మేషం : బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెలకువ వహించండి. వివాహ నిశ్చితార్థంలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు, పనిభారంతో సతమతమవుతారు. పెద్దలు, మీ జీవితభాగస్వామి సలహా మిమ్మలను ఆలోచింపజేస్తుంది.
 
వృషభం : ఆస్తి పంపకాల విషయంలో సోదరీ సోదరుల మధ్య ఒప్పందం ఖరారవుతుంది. కష్టసమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. వివాహ వేదికల కోసం యత్నాలు మొదలెడతారు. ఆధ్యాత్నిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. 
 
మిథునం : వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. హామీలు, చెక్కుల జారీలో ఆలోచన మంచిది. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. సత్కాలం రాబోతోంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి అధికం. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాలు సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థుల ప్రేమ వ్యవహారం ఇబ్బందికి దారితీస్తుంది. రావలసిన ధనం ఆలస్యంగా అందడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. 
 
సింహం : ఇంటాబయట మీ ఆధిపత్యం కొనసాగుతుంది. వృత్తిరంగా మీ గౌరవం పెరగడంతో పాటు కొత్త పరిచాయాలేర్పడతాయి. భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఒక సమస్య మీ సహనానికి పరీక్షగా నిలుస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 
 
కన్య : మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. క్రయ, విక్రయాలు సామాన్యం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
తుల : జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. గృహంనకు కావాలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలబాటన పయనిస్తాయి. ఎప్పటి నుంచో వసూలుకాని మొండిబాకీలు వసూలవుతాయి. శత్రువులు, మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. 
 
వృశ్చికం : పరుషమైన మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయని గుర్తుపెట్టుకోండి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు సాధించగలుగుతారు. 
 
ధనస్సు : కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగానే సాగుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. 
 
మకరం : తలపెట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మీరెంత శ్రమించినా గుర్తింపు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. 
 
కుంభం : బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. విద్యార్థులు ప్రమే వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు మీ బడ్జెట్‌కు అనుగుణంగానే ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ వాహనం పిల్లలకు, ఇతరులకు ఇవ్వడం మంచిది కాదు. 
 
మీనం : రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు పూర్తి చేసుకోగలగుతారు. గృహ మరమ్మతులు, మార్పులకు అనుకూలం. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు.