శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-02-2020 శనివారం మీ రాశి ఫలితాలు

శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా వుండటం మంచిది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు పనిభారం అధికం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 
 
వృషభం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
మిథునం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలకు నూతన పరిచయాలు, చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. 
 
కర్కాటకం: మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
సింహం: ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. రుణాలు, చేబదుళ్లు తప్పవు.  
 
కన్య: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నిరుత్సాహపరుస్తాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి.
 
తుల: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విందులలో పరిమితి పాటించండి. అధ్యాపకులకు పురోభివృద్ధి. విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా వుండటం మంచిది. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. 
 
వృశ్చికం: మీ కళత్ర పట్టుదల, సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విదేశీయానాలకై చేయు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ సమర్థతపై అధికారులకు నమ్మకం కలుగుతుంది. 
 
ధనస్సు: దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయ చేస్తారు.
 
మకరం: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. ఖర్చులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల మీ పనులు వాయిదా పడతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
కుంభం: మీ శక్తి సామర్థ్యాలు ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మందలింపులు తప్పవు. ఇతరుల విషయాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. ఎదుటివారితో మితంగా సంభాషించడం క్షేమదాయకం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం.
 
మీనం: ప్రముఖుల సాయంతో ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. స్పెక్యులేషన్ రంగాల వారికి నిరుత్సాహం వంటివి తప్పదు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా వుంచండి. పాత మిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.