మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (13:35 IST)

28-02-2020 శుక్రవారం మీ రాశి ఫలితాలు - గౌరీదేవిని ఆరాధించినట్లైతే..? (video)

గౌరిదేవిని ఆరాధించినా మనోసిద్ధి చేకూరుతుంది. 
 
మేషం : దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడర్లు గుమస్తాలకు చికాకులు తప్పవు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ రంగాల వారికి శుభదాయకం. మీ సంతానం, విద్య, వివాహ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. 
 
వృషభం: ఉద్యోగస్తులు ప్రమోషన్‌లకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారికి చికాకులు అధికమవుతాయి. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికమైనా సంతృప్తి. ప్రయోజనం వుంటాయి. 
 
మిథునం: ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. సోదరీ సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించాల్సి వస్తుంది. తొందరపడి వాగ్ధానాలు చేయడం వలన సమస్యలు ఎదుర్కొనక తప్పదు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. 
 
కర్కాటకం: గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. స్త్రీలు షాపింగ్‌లో నాణ్యతను గమనించాలి. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.
 
సింహం: పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం. క్రయ విక్రయాలు లాభసాటిగా వుంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ, రుణయత్నాలకు ఇది అనువైన సమయం. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం మంచిది కాదు.
 
కన్య: వస్త్ర, బంగారు, వెండి లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఏ విషయానికి కలిసిరాని సోదరీ సోదరుల ధోరణి అసహనం కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి.
 
తుల: కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం లోపిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. కార్యసాధనలో జయం పొందుతారు. అనుకున్న పనులు తక్షణం పూర్తి కాగలవు. విద్యార్థినుల్లో ఏకాగ్రత లోపం, గ్రహింపు శక్తి తక్కువగా ఉండటం వల్ల ఆందోళనకు గురవుతారు.
 
వృశ్చికం: వ్యాపారాల విస్తరణలు, పరిశ్రమల స్థాపనలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. నిరుద్యోగులు, అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ, వ్యయాల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
ధనస్సు: ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. విద్యార్థినులు భయాందోళనలు వీడి పట్టుదలతో శ్రమించాల్సి వుంటుంది. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్‌లోను, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. 
 
మకరం: శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లు, నర్సులకు ఏకాగ్రత ముఖ్యం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. విదేశీయానం, రుణ యత్నాలు అనుకూలిస్తాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
కుంభం: ఉద్యోగస్తులు కార్యాలయ కార్యార్థం ప్రయాణం చేయాల్సి వుంటుంది. కుటుంబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త  కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఆత్మీయులు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు.
 
మీనం: సంఘంలోను, కుటుంబంలోను మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. ప్రేమికుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు వివాహ సంబంధాలు కుదుర్చుకుంటారు.