మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-03-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు

సూర్యస్తుతి ఆరాధనతో శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు సిద్ధంగా వుంటాయి. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగువేయాల్సి వుంటుంది. పత్రికా సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
వృషభం: మత్స్యకోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి.
 
మిథునం: కుటుంబ, ఆర్థిక సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరుల గురించి యధాలాపంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కొత్త ఆశలను కలిగిస్తాయి.
 
కర్కాటకం: సంఘంలో మీ మాటకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కచ్చితంగా వ్యవహరించండి. స్త్రీల ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
సింహం: మీ శ్రమను దుర్వినియోగం చేయకండి. కుటుంబీకులతో కలహాలు, మాటపట్టింపులు తలెత్తే సూచనలున్నాయి. ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఉపాధ్యాయులకు విశ్రాంతికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అనుకూలం.
 
కన్య: మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించి, మిమ్మల్ని ఒక మార్గంలో నడిపించాలని ఆశిస్తారు. వ్యాపారంలో ఎంతో పక్కగా తయారుచేసుకున్న ప్రణాళికలు విఫలం కావచ్చు. సహోద్యోగులతో కలిసి సభ, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది.  
 
తుల: ప్రతి, పొగాకు, కంది, స్టాకిస్టులకు వ్యాపారస్తులకు కలిసివస్తుంది. చిన్న తరహా పరిశ్రమలలో వారికి సంతృప్తి కానరాగలదు. ఇతరుల సమస్యలకు మీరు పరిష్కార మార్గం చూపించడం వలన మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరీ, సోదరులను కలుసుకుంటారు. మీలోని సృజనాత్మక సన్నగిల్లిపోతుందని గ్రహించండి. 
 
వృశ్చికం: కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. హామీలు ఉండుట మంచిది కాదని గమనించండి. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. 
 
ధనస్సు: వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. మీపై శకునాలు, పట్టింపులు తీవ్ర ప్రభావం చూపుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఇబ్బందులకు దారితీస్తాయి. 
 
మకరం: రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. దైవ దర్శనాలు అనుకూలం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. స్త్రీలు తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవడం క్షేమం కాదు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. 
 
కుంభం: ఓర్పు, పట్టుదలతోనే మీ లక్ష్యం సాధించగలుగుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కొత్త ఆశలను కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా ముగుస్తాయి. ఎవరికి పెద్ద మొత్తంలో ధనసహాయం చేయడం మంచిది కాదు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. 
 
మీనం: స్త్రీలకు పనివారితో చికాకు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల ఆహార, ఆరోగ్య వ్యవహారాల్లో మెళకువ అవసరం.