సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (17:13 IST)

విమానాలలో ప్రయాణికులకు లగేజీ చార్జీలను పెంచిన ఎయిర్ ఇండియా...

విమానాలలో లగేజీ చార్జీలను పెంచిన ఎయిర్ ఇండియాపై ప్రయాణికులు మండిపడుతున్నారు. దేశీయ రూట్లలో ప్రయాణికులకు కిలో లగేజీ బరువుపై రూ. 100 పెంచారు. ప్రస్తుతం ఈ సంస్థ అదనపు లగేజీల ప్రతి కిలోపై రూ. 400 తీసుకుంట

విమానాలలో లగేజీ చార్జీలను పెంచిన ఎయిర్ ఇండియాపై ప్రయాణికులు మండిపడుతున్నారు. దేశీయ రూట్లలో ప్రయాణికులకు కిలో లగేజీ బరువుపై రూ. 100 పెంచారు. ప్రస్తుతం ఈ సంస్థ అదనపు లగేజీల ప్రతి కిలోపై రూ. 400 తీసుకుంటున్నారు.  కానీ ఇకపై అదనపు లగేజీలు తీసుకెళ్లే వారికి ప్రతి కిలోకు రూ. 500 కట్టవలసిందింగా ఎయిర్ ఇండియా తన నింబంధనలను తెలియజేసింది.  
 
చార్జీలను పెంచిన ఎయిర్ ఇండియా త్వరలోనే అన్ని విమానాలలో జూన్ 11వ తేది నుండి ఈ నిబంధనలను అమలులోకు తీసుకురానున్నారు. అంతేకాకుండా ఎకానమీ తరగతి ప్రయాణికులు చార్జీలపై అదనంగా 5 శాతం జీఎస్టీ, ఇతర తరగతుల వారు 12 శాతం జీఎస్టీ కూడా కట్టవలసిందింగా ఎయిర్ ఇండియా తెలియజేసింది. కానీ, ఈశాన్య రాష్ట్రాలలోని విమాన ప్రయాణికులకు జీఎస్టీ చార్జీలు ఉండవని కూడా ఎయిర్ ఇండియా తెలియజేసింది.