గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (12:52 IST)

వైమానిక దాడులు బీజీపీకి లాభం.. : బీఎస్ యడ్యూరప్ప

భారత వైమానిక దళం నిర్వహించిన దాడులు భారతీయ జనతా పార్టీకి ఎంతో మేలు చేస్తాయని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత బీఎస్.యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, ఈ దాడుల వల్ల బీజేపీ కర్నాటక రాష్ట్రంలో 22 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న జైషే మొహ్మద్ ఉగ్రతండాలపై భారత వైమానికదళం దాడులు జరిపిన విషయం తెల్సిందే. ఈ దాడులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పాకిస్థాన్.. భారత్‌పై ప్రతిదాడులకు దిగింది. ముఖ్యంగా భారత రక్షణ స్థావరాలపై బాంబులు వేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ఈ దాడులపై బీఎస్. యడ్యూరప్ మాట్లాడుతూ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని తిరిగి ఎన్నుకునేందుకు అనేక మంది ఓటర్లు ఎదురు చూస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా తీవ్రవాద తండాలపై దాడులు చేయాలని ప్రధాని మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం జాతి ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా, దేశ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఇది భారతీయ జనతా పార్టీకి ఎంతో మేలు చేస్తుందన్నారు. 
 
ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో మరిన్ని సీట్లు గెలుచుకునేందుకు ఎంతగానో హోదపడుతుందన్నారు. ఇది నరేంద్ర మోడీకి మరింత బలంగా మారుతుందన్నారు. ఉగ్రతండాలపై భారత్ రక్షణ దళాలు మెరుపుదాడులు చేసి... తమ బలాన్ని ప్రపంచానికి మరోమారు చాటిచెప్పాయన్నారు. ఈ దాడులు ఖచ్చితంగా బీజేపీకి మేలు చేస్తాయని, ఫలితంగా రాష్ట్రంలో 22 సీట్లకు మించి గెలుచకుంటుందని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ సంపూర్ణ మెజార్టీతో మరోమారు ప్రధానిగా బాధ్యతలు చేపడుతారని యడ్యూరప్ప జోస్యం చెప్పారు.