మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జులై 2022 (11:36 IST)

నుపూర శర్మ తలకు బహుమతి ప్రకటించిన అజ్మీర్ దర్గ మతాధికారి అరెస్టు

arrest
ప్రవక్త మొహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజీపీ నుంచి బహిష్కరణకు గురైన నూపుర్ శర్మ తల నరికి తెచ్చినవారికి తన ఆస్తిని రాసిస్తానంటూ ఓ వీడియోలో ప్రకటించిన అజ్మీర్ దర్గా మతాధికారి సల్మాని చిస్టీని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ‘ఖాదీమ్’ సల్మాన్ చిస్టీపై అజ్మీర్ పోలీసులు సోమవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 
"సల్మాన్ చిస్తీ గత రాత్రి (మంగళవారం) పట్టుబడ్డాడు... అతను దర్గా పోలీస్ స్టేషన్‌లో హిస్టరీ-షీటర్" అని ఒక అధికారి తెలిపారు. వీడియోలో, మత గురువు తన వద్దకు శర్మ తలను తీసుకువచ్చే ఎవరికైనా తన ఇంటిని బహుమతిగా ఇస్తానని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రవక్తను అవమానించినందుకు ఆమెను కాల్చి చంపేస్తానని చిస్టీ హెచ్చరించారు. 
 
గత వారం, జూన్ 17న అజ్మీర్ దర్గా ప్రధాన ద్వారం వద్ద చేసిన మరో రెచ్చగొట్టే ప్రసంగానికి సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. ఆ వీడియో ఇంతకు ముందు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇస్లాం మతాన్ని అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నామని చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్‌ను చంపిన తర్వాత అరెస్టులు జరిగాయి.
 
అయితే ఇద్దరు వ్యక్తులు రాజ్‌సమంద్‌లో మోటార్‌సైకిల్‌పై పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఈ హత్య కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురిని అరెస్టు చేసింది.