శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 16 జనవరి 2017 (22:11 IST)

నాన్నా... నా పార్టీలో చేరండి, నన్ను దీవించండి... అఖిలేష్? చావగొట్టి చెవులు మూయడమంటే ఇదేనా?

రాజకీయాలంటే ఇలాగే వుంటాయని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. అలనాడు రాజుల కాలం నుంచి నేడు రాజకీయ నాయకుల కాలం వరకూ ఇదే వెన్నుపోట్లు. తాజాగా ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి కూడా ఇలాగే అయ్యింది. పార్టీని స్థాపించి, కష్టపడి ఈ దశకు తీసుకువస్తే కొడుకు దాన్ని

రాజకీయాలంటే ఇలాగే వుంటాయని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. అలనాడు రాజుల కాలం నుంచి నేడు రాజకీయ నాయకుల కాలం వరకూ ఇదే వెన్నుపోట్లు. తాజాగా ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి కూడా ఇలాగే అయ్యింది. పార్టీని స్థాపించి, కష్టపడి ఈ దశకు తీసుకువస్తే కొడుకు దాన్ని ఎగరేసుకవెళ్లిపోయారు.
 
దీనితో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు మెగా షాక్ కొట్టింది. తండ్రీకొడుకుల మధ్య రగులుతూ వచ్చిన చిచ్చు పార్టీ తనదంటే తనదనేవరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సైకిల్ గుర్తు తనకే కేటాయించాలంటూ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. 
 
అఖిలేష్ యాదవ్ సైతం సైకిల్ గుర్తుతో పాటు పార్టీ కూడా తనదేనంటూ ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకున్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం... పార్టీతో పాటు సైకిల్ గుర్తు కూడా అఖిలేష్ యాదవ్ దేనని స్పష్టం చేసింది. దీనితో అఖిలేష్ వర్గం సంబరాలు చేసుకుంటున్నారు. సమాజ్ వాదీ పార్టీకి అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడని కూడా ఎన్నికల సంఘం వివరించింది. దీనితో ములాయం సింగ్ యాదవ్ తన కన్న కొడుకు చేతిలోనే న్యాయపరంగా ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోయాడు.
 
ఇదిలావుంటే పార్టీతో పాటు పార్టీ గుర్తు అన్నీ తనకు రావడంపై అఖిలేష్ యాదవ్ ఖుషీఖుషీగా వున్నారు. అంతేకాదు, తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ వద్దకు వెళ్లి దీవెనలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇంకా తన పార్టీలో చేరండి నాన్నా అని అడిగే అవకాశం కూడా లేకపోలేదని కొందరు అంటున్నారు. వెనుకటికి ఎవరో చెప్పినట్లు చావగొట్టి చెవులు మూయడమంటే ఇదేనేమో...?