ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 మార్చి 2020 (08:52 IST)

నేటి నుంచి అన్ని రకాల వీసాలు బంద్..!

కరోనా నియంత్రణ కోసం కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే దౌత్య, ఉపాధి వంటి కొన్ని రకాల వీసాలకు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సస్పెన్షన్ మార్చి 13 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే దౌత్య, ఉపాధి వంటి కొన్ని రకాల వీసాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం (జీఓఎమ్) ఈ కీలక నిర్ణయం తీసుకుంది.