ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 29 జులై 2017 (10:28 IST)

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల ఆఫర్.. రాత్రికి రాత్రి బెంగుళూరుకు...

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు అధికార బీజేపీలో చేరుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ప

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు అధికార బీజేపీలో చేరుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో 54 మందిని రాత్రికి రాత్రే బెంగుళూరుకు తరలించింది.  
 
దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పర్మార్ స్పందిస్తూ, బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లోనుకాకుండా ఉండేందుకే వారిని దూరంగా తీసుకెళుతున్నట్టు చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్లను బీజేపీ ఆఫర్ చేస్తోందని మండిపడ్డారు.
 
కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. తాము డబ్బు ఇవ్వజూపుతున్నామనే ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన... సింపుల్‌గా నవ్వేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోయే నావలాంటిదని, అందుకే వారంతా ఓడ పూర్తిగా నీటిలో మునిగిపోకముదే దిగిపోతున్నారని చమత్కరించారు.