సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (16:38 IST)

అవిశ్వాసం నెగ్గదండోయ్.. మాకు 300మంది ఎంపీలున్నారు: అమిత్ షా ధీమా

కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై అవిశ్వాస తీర్మానం చేపట్టేందుకు తెలుగుదేశం, వైకాపాలు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఎన్డీయేకు 300 మందికి పైగా ఎంపీల మద్దతు వుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్

కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై అవిశ్వాస తీర్మానం చేపట్టేందుకు తెలుగుదేశం, వైకాపాలు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఎన్డీయేకు 300 మందికి పైగా ఎంపీల మద్దతు వుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తాము తేలికగా ఓడిస్తామని చెప్పారు. 
 
అవిశ్వాసంపై చర్చ జరగాలని.. అలా జరిగి ఓటింగ్‌కు వెళ్ళినా అవిశ్వాసం నెగ్గదని అమిత్ షా తెలిపారు. అందుకే సభ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారని అమిత్‌ షా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విపక్షాలకు విందులిచ్చి బీజేపీపైకి నెట్టినా ప్రయోజనం వుండదని స్పష్టం చేశారు. 
 
మరోవైపు తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించేందుకు అమిత్ షా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని బయటపెట్టాలని బీజేపీ నేతలకు ఇప్పటికే అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ మేరకు ఏపీ నేతలతో శనివారం జరిగిన సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. ఏపిలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహం, టీడీపీపై విజయంపై అనుసరించాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.