శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మే 2024 (19:56 IST)

ఢిల్లీలో రోటీలు అమ్ముతున్న కుర్రోడు... కాంటాక్ట్ నంబర్ కావాలంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

roti boy - anand
ఢిల్లీలో రోటీలు విక్రయిస్తున్న కుర్రాడి వీడియోను దేశ పారిశ్రామికదిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఆ వీడియోలోని కుర్రాడి కాంటాక్ట్ నంబర్ కావాలంటూ ట్వీట్ చేశారు. ఆ కుర్రోడికి సాయం చేస్తానంటూ ముందుకు వచ్చారు. అతని చదువులకు ఆటంకం కలగకుండా మహీంద్రా ఫౌండేషన్ సాయం చేస్తుందంటూ ట్వీట్ చేశారు. 
 
ఆనంద్ మహీంద్రా ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలో పదేళ్ల జస్ప్రీత్ అనే కుర్రోడు రోటీలు చేసి అమ్ముకోవడం చూడొచ్చు. మెదడు కేన్సర్ వల్ల తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు పసివాడిపై పడ్డాయి. అతనికి ఓ అక్క కూడా ఉంది. తల్లి తమను వదిలేసి వెళ్లిపోవడంతో ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంకాలం ఇలా ఫుడ్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్రా... ఆ బాలుడి వివరాలు కావాలంటూ ట్వీట్ చేశారు. 
 
"నాకు తెలిసి అది ఢిల్లీలోని తిలక్ నగర్ అనుకుంటా. మీలో ఎవరికైనా జస్ప్రీత్ కాంటాక్ట్ నంబర్ తెలిస్తే షేర్ చేయండి. అతని చదువు పాడవుకూడదు. మహీంద్రా ఫౌండేషన్ టీమ్ అతనికి ఎలా చదువుపరంగా సాయం చేస్తుందనేది వివరిస్తుంది" అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇపుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరోమారు ఆనంద్ మహీంద్రా మంచి మనసుకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.