పంచాయతీ సభ్యుడు - ఆశా వర్కర్.. మస్తుమజా.. వీడియో వైరల్

romance
ఠాగూర్| Last Updated: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:16 IST)
కర్నాటక రాష్ట్రంలో రాసలలీల కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికిమొన్న ఈ రాష్ట్రంలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో బయటకు వచ్చింది. ఇది రాష్ట్ర రాజకీయాలనే ఓ కుదుపు కుదిపేసింది. చివరకు ఆయన మంత్రిపదవికి ఎసరుపెట్టింది.

ఈ ఘటనను మరువక ముందే మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది ఓ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్తగా భావిస్తున్నారు. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. దీనిపై కన్నడ నాట ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. తాజా వీడియోపై పోలీసులు చర్యలు తీసుకున్నారా? అన్న సంగతి తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.దీనిపై మరింత చదవండి :