శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

కర్ణాటకలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ

కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కేసీ రామమూర్తి బుధవారంనాడు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

రాజీనామా పత్రాన్ని రాజ్యసభ సభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు అందజేయగా ఆయన దానిని ఆమోదించారు. రామమూర్తి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో, కాంగ్రెస్‌కు చెందిన భువనేశ్వర్ కలిత, సంజయ్ సింగ్‌ సైతం రాజ్యసభకు రాజీనామా చేశారు.

అలాగే బీజేపీలో చేరేందుకు వీలుగా నీరజ్ శేఖర్, సురేంద్ర సింగ్ నెగర్, సంజయ్ సేథ్‌లు ఇటీవల సమాజ్‌వాదీ పార్టీని, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాన్ని వీడారు. ఆ తర్వాత బీజేపీ టిక్కెట్‌పై వీరంతా పోటీ చేసి తిరిగి ఎన్నికయ్యారు.

దీంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. గత జూన్‌లో నలుగురు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీలు సైతం బీజేపీలో చేరారు.