బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (18:34 IST)

పంజాబ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు పూర్తి - ఆప్‌కు ఎన్ని సీట్లంటే..

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం నుంచి చేపట్టగా సాయంత్రానికి ముగిసింది. తుది ఫలితాల్లో మొత్తం 117 సీట్లు పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే దక్కాయి. 
 
శిరోమణి అకాలీదళ్ పార్టీ 4 సీట్లతో సరిపుచ్చుకుంది. దీంతో 92 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. మొత్తంగా 59 సీట్లు దక్కించుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండగా, ఆప్ పార్టీ ఏకంగా 92 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.