సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (13:51 IST)

అగ్నిపథ్ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు.. వచ్చే నెలలో రిక్రూట్మెంట్

agnipath
సైనిక సర్వీసుల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అగ్నిపథ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, వచ్చే నెల నుంచి రిక్రూట్మెంట్ ప్రారంభించనున్నట్టు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. 
 
ఇదే అంశంపై మాట్లాడుతూ, త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్మంట్ షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తామన్నారు. ఆర్మీలో చేరాలనుకుంటున్నట్టు యువత వయోపరిమితిని ఒక్కసారి పెంచుతామన్నారు. రిక్రూట్మెంట్ ఏజ్‌ను 23 యేళ్లకు పెంచుతామని చెప్పారు.
 
ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువతకు దేశభక్తిని చాటుకునే అవకాశం దొరుకుతుందన్నారు. కరోనా సమయంలో ఎంతో కష్టపడ్డ యువతకు ఇపుడు మంచి అవకాశం లభించిందని తెలిపారు. అగ్నీవీరులుగా సైన్యం చేసే అవకాశాన్ని దేశంలోని యువత వినియోగించుకోవాలని ఆయన కోరారు.