సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (15:02 IST)

భారత సైన్యం కొత్త అధ్యక్షుడుగా మనోజా పాండే

manoj panday
భారత కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెట్ జనరల్ మనోజ్ పాండే నియమితులు కాగా, ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సైన్యాధ్యక్షుడి బాధ్యతలను ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే అప్పగించారు. ఇప్పటివరకు జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ ఉప చీఫ్‌గా పనిచేశారు. ఎంఎం నరవణే పదవీకాలం ముగియడంతో ఆయనకు పదోన్నతి కల్పించారు. 
 
కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్ అయిన తొలి అధికారిగా జనరల్ మనోజ్ పాండే చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. గతంలో ఈ విభాగం నుంచి వైస్ చీఫ్ స్థానం వరకే రాగలిగారు. 1962 మే 6న జన్మించిన పాండే.. ఆర్మీకి 29వ అధిపతిగా పనిచేయనున్నారు. 62 ఏళ్ల వరకు లేదంటే మూడేళ్లు ఈ రెండింటిలో ఏది ముందే అయితే అప్పుటివరకు పదవిలో కొనసాగుతారని కేంద్రం వెల్లడించింది. 
 
కాగా, భారత్ పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ వైస్ చీఫ్ పదవిని మే 1న బీఎస్ రాజు చేపట్టనున్నారు. ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్‌‌గా ప్రస్తుతం రాజు పనిచేస్తున్నారు.