శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (08:12 IST)

అయోధ్య విమానాశ్రయం పేరు 'శ్రీరామ్'

అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ సిఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ మంత్రివర్గం తీర్మానించింది. ఈ వినామాశ్రయానికి మర్యాద పురుషోత్తం శ్రీరామ్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది.

అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడం పట్ల సాధువులు హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదనను కొంత కాలంగా ఉంది. చివరకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం దాన్ని ఆమోదించడం గమనార్హం.

అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది. అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని గతంలోనే సిఎం ఆదిత్యనాథ్ ప్రకటించారు.