గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (17:36 IST)

అయోధ్య బాల రాముడి పేరు మార్పు - ఇకపై ఏ పేరుతో పిలుస్తారంటే..

ram lalla
అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ట చేసిన బాల రాముడి పేరు మార్చారు. ఇకపై రామ్ లల్లా పేరును బాలక్ రామ్‌గా నామకరణం చేశారు. ఇకపై ఈ పేరుతోనే రామ్ లల్లాను పిలువనున్నారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలుస్తారని ట్రస్ట్ పూజారి వెల్లడించారు. గర్భగుడిలో కొలువుదీరిన రాముడి వయసు ఐదేళ్ళేనని ఆయన వెల్లడించారు. అందుకే ఆయనను బాలక్ రామ్‌గా పిలుస్తారని తెలిపారు. 
 
ఇకపై రామ్ లల్లాను బాలక్ రామ్‌గా పిలువనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని, అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలుస్తామని తెలిపారు. 
 
మరోవైపు, స్వామికి రోజుకు ఆరుసార్లు హారతిని ఇస్తామని ట్రస్ట్‌కు చెందిన ఆచార్య మిథిలేశ్ నందిని తెలిపారు. మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్య, శయన హారతి ఇస్తారమని చెప్పారు. పూరి, కూరతో పాటు పాలు పండ్లు, రబ్‌ డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు. ఈ రోజు నుంచి బాల రాముడి దర్శనానికి సామాన్య ప్రజలకు అనుమతించారు. దీంతో ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది.