శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (20:24 IST)

మారుతీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 3 వేలమంది ఉద్యోగాలు ఫట్

తమ కంపెనీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది మారుతీ సుజుకీ. ఇటీవల కాలంలో కార్ల సేల్స్ తగ్గడంతో సంస్థ ఢీలా పడింది. ఈ క్రమంలోనే మారుతీ కార్ల తయారీ సంస్థలో పని చేసే 3 వేల మంది ఉద్యోగులను తొలగించింది.

ఆటోమొబైల్ రంగంలో మారుతీ కార్ల డిమాండ్ తగ్గడంతోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని సంస్థ చైర్మన్ RC భార్గవ తెలిపారు. లాస్ నడిచినప్పుడు ఏ సంస్థనైనా ఉద్యోగులను తీసేయడం  బిజినెస్‌లో కామన్ అన్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మరింతమంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్‌ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుందని చెప్పారు.
 
అయితే, పర్మనెంట్‌ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. కొంతకాలంగా మారుతీ కార్ల సేల్స్ దారుణంగా పడిపోతున్నాయని.. దీంతో ఆటోమొబైల్‌ పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. డిమాండ్‌ లేకపోవడం, నిల్వలు పెరిగిపోవడంతో కొన్ని సంస్థలు ఉత్పత్తిని నిలిపివేశాయని చెప్పారు.
 
ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే.. ఆటోమొబైల్‌ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు భార్గవ.