మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (09:19 IST)

ఉన్నావ్ లో బీజేపీ వ్యవహార శైలిపై అనుమానాలు

స్వాతంత్య దినోత్సవం, రక్షాబంధన్‌ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఉత్తరప్రదేశ్‌లోని ఓ పత్రికకు బిజెపి ఇచ్చిన వాణిజ్య ప్రకటన అనుమానాలు రేపుతోంది.

లైంగికదాడి, హత్యాయత్నం అభియోగాలతో విచారణను ఎదుర్కొంటూ, ప్రస్తుతం జైలులో వున్న ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లతో కలసి ఉన్న ఫొటోను ఆ యాడ్‌లో ముద్రించారు.

మైనరుపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఎమ్మెల్యే ఫొటోను రక్షాబంధన్‌ యాడ్‌లో వేయటమేంటని మహిళా సంఘాలు ప్రశ్నిస్తు న్నాయి. మరోవైపు ఆయనను బహిష్కరించినట్టు బిజెపి చెప్పుకుంటుండగా.. ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి ఫొటో ముద్రించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

'ఆయన మా ప్రాంత ఎమ్మెల్యే. అందువల్లే ఆయన ఫొటోను వేశాం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతవరకూ ఫొటోను వేస్తూనే ఉంటాం' అని బిజెపి నాయకుడు, ఉంగూనగర్‌ పంచాయతి చైర్మెన్‌ అనుజ్‌కుమార్‌ దీక్షిత్‌ చెప్పారు. అన్న కష్టాల్లో ఉన్నాడనీ, ఆయన త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నా మంటూ ఇటీవల హర్దోరు బిజెపి ఎమ్మెల్యే ఆయనకు మద్దతుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.