గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (19:54 IST)

భూటాన్‌లో మోడీకి అరుదైన స్వాగతం

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు భూటాన్ చేరుకొన్నారు. ఇవాళ ఉదయం మోడీకి భూటాన్ ప్రధాని లొటాయ్ షెరింగ్ ఘనంగా స్వాగతం పలికారు. 
 
భూటాన్ సాయుధ బలగాల గౌరవ వందనాన్ని మోడీ స్వీకరించారు. మోడీకి భారత జాతీయ పతాకాలను చేతబూని స్థానికులు స్వాగతం పలికారు. రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భూటాన్ పర్యటించడం మోడీ మొదటిసారి.
 
భూటాన్ లో తనకు సాదర స్వాగతం పలకడంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సంతోషాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. రెండు దేశాలు తొమ్మిది అంశాలపై ఒప్పంధాలను చేసుకోనున్నాయి.