1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (07:47 IST)

నిన్న మ్యాగి నూడల్స్... నేడు కేఎఫ్‌సీ చికెన్‌... సుర‌క్షితం కాదంటున్న ప‌రీక్ష‌లు..?

ఇండియాలో మ్యాగీ నూడుల్స్ ప‌ని అయిపోయింది. ఇప్ప‌టికే కొన్ని వేల కోట్ల రూపాయిల స‌రుకు ధ్వంసం చేశారు. ప్ర‌స్తుతం నాన్‌వెజ్‌లో కేఎఫ్‌సీ వంతు వ‌చ్చేసింది. దాని శాంపిల్స్ తీసిన అధికారులు సుర‌క్షితం కాద‌ని తేల్చేశారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో తీసిన శాంపిల్స్‌ను పరీక్ష‌ల‌కు పంపి నివేదిక‌లు సిద్ధం చేశారు. 
 
కేఎఫ్‌సీ చికెన్‌ సురక్షితం కాదని పరీక్షల్లో వెల్లడైనట్లు తెలిసింది. కేఎఫ్‌సీ చికెన్‌పై ఇటీవల ఆరోపణలు రావడంతో ఆహార భద్రతా చట్టం కింద తెలంగాణ ప్రభుత్వం 15 శాంపుళ్లను సేకరించి పరీక్షలు చేయించింది. మరోవైపు, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చట్టం కింద 28 శాంపుళ్లను సేకరించి పరీక్షించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వాటి ఫలితాలు బాగానే వచ్చినా... జీహెచ్‌ఎంసీ సేకరించిన వాటిలో 8 శాంపుళ్లలోని చికెన్‌ తినడానికి సురక్షితం కాదని తేలినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రత్యేక నివేదికను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా సదరు నమూనాలకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.