గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (17:51 IST)

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీ...

jobs
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అయ్యింది. ఒప్పంద ప్రాతిపదికన 72 డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌, డిజిటల్‌ లెండింగ్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌, స్పెషల్‌ అనలిస్ట్‌, బిజినెస్‌ మేనేజర్‌, జోనల్‌ మేనేజర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
 
పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌/బీఎస్సీ/బీసీఏ/ఎంసీఏ/సీఏ/సీఎఫ్‌ఏ/ఎంబీఏ/పీజీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 11,2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.