సోమవారం, 27 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated: గురువారం, 22 సెప్టెంబరు 2022 (11:52 IST)

ఒరిస్సాలో దారుణం : భర్తను కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్

assault
ఒరిస్సాలో దారుణం జరిగింది. భర్తను కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనపై స్పందించిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉండటం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మయూర్​భంజ్​ జిల్లాకు చెందిన దంపతులు సోమవారం వేకువజామున బాలేశ్వర్​ రైల్వే స్టేషన్​ నుంచి బయటకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆ తర్వాత భర్తపై దాడి చేయగా, వారు అక్కడ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి, సమీపంలోని ఓ భవనంలో దాక్కున్నారు. 
 
వారిని వెతుక్కుంటూ ఆ భవనంలోకి వచ్చిన నిందితులు భర్తను మరోసారి చితకబాది... 28 ఏళ్ల మహిళను పొలానికి లాక్కెళ్లి వారంతా కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత బాధిత దంపతులు సహదేవ్​కుంట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుల్లో నలుగుర్ని 48 గంటల్లోనే అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు బుధవారం చెప్పారు.