శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (07:18 IST)

మహాభారత యుద్ధం 18 రోజులు- కరోనాపై పోరు 21 రోజులు: మోదీ

మహాభారత యుద్ధం 18 రోజులు సాగిందని.. కరోనా మహమ్మారిపై పోరు 21రోజుల పడుతుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సొంత నియోజకవర్గమైన వారణాసి ప్రజలతో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు ప్రధాని.

కరోనాపై పోరులో యావత్​ భారతదేశానికి వారణాసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కరోనాపై పోరులో వారణాసి.. యావత్​ దేశానికే ఆదర్శంగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సామాజిక దూరం పాటిస్తూ.. ఇతరుల్లో స్ఫూర్తి నింపాలని కోరారు.

గడ్డు కాలంలో సొంత నియోజకవర్గంలో ఉండాలని.. కానీ దిల్లీలో పరిస్థితుల దృష్ట్యా కుదరలేదని వివరించారు. ఎంత తీరిక లేకుండా ఉన్నా.. వారణాసిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్టు ప్రధాని చెప్పారు.

మహాభారత యుద్ధం 18 రోజుల పాటు సాగిందని.. కరోనా మహమ్మారిపై పోరు 21 రోజులు పడుతుందని మోదీ పేర్కొన్నారు. వాట్సాప్​లో హెల్ప్​డెస్క్​ ఏర్పాటు చేసినట్టు మోదీ వారణాసి ప్రజలకు తెలిపారు. ఎలాంటి సందేహాలున్నా.. 9013151515 నంబర్​కు వాట్సాప్​ చేయాలన్నారు