మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (10:40 IST)

శ్రీరామనవమి అల్లర్లు .. బీహార్‌లో కేంద్ర మంత్రి కుమారుడు అరెస్టు

శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ చౌబే కుమారుడు అరిజిత్ శాశ్వత్‌ను బీహార్ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో అధికార జేడీయూ-బీజేపీ కూటమిలో విభేదాలు తారస

శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ చౌబే కుమారుడు అరిజిత్ శాశ్వత్‌ను బీహార్ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో అధికార జేడీయూ-బీజేపీ కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి 
 
గత 17వ తేదీన భగల్‌పూర్‌లో అరిజిత్ శాశ్వత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి ఊరేగింపులో ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు అరిజిత్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అతడి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో శనివారం అర్థరాత్రి అరిజిత్‌ను పట్నాలో అరెస్ట్ చేశారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది.