బీహార్ ఎగ్జామ్ బోర్డు నిర్లక్ష్యం.. హాల్ టిక్కెట్‌పై ఫోటోకు బదులు నగ్న ఫోటో
బీహార్ ఎగ్జామ్ బోర్డు నిర్లక్ష్యానికి ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. బీహార్ ఎగ్జామ్ బోర్డు చేసిన తప్పిదం ఓ విద్యార్థినికి షాకిచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పరీక్ష హాల్ టికెట్‌పై ఆమె ఫొటోకు బదులు ఓ నటి న
బీహార్ ఎగ్జామ్ బోర్డు నిర్లక్ష్యానికి ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. బీహార్ ఎగ్జామ్ బోర్డు చేసిన తప్పిదం ఓ విద్యార్థినికి షాకిచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పరీక్ష హాల్ టికెట్‌పై ఆమె ఫొటోకు బదులు ఓ నటి నగ్న ఫోటోను ఉంచారు. ఈ విషయాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ హిందీ దినపత్రికలో దీనికి సంబంధించిన కథనం వచ్చింది. దీంతో, బోర్డు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 8న బీహార్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్ష హాల్ టికెట్లను జారీ చేసింది. హాల్ టికెట్‌ను చూసుకున్న సదరు విద్యార్థిని తన ఫొటో స్థానంలో హీరోయిన్ ఫొటో రావడంతో షాక్ అయింది.