శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (20:07 IST)

విగ్రహ నిమజ్జనంలో అపశృతి... ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

lord ganesha
గణేశ విగ్రహ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌, డొమినియా ఖండలో.. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఐదుగురు బాలికలు చెరువులోకి దిగారు. 
 
అయితే చెరువులో దిగిన ఐదుగురు బాలికల్లో ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అని పోలీసుల విచారణలో తేలింది. మరో ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుల కుటుంబం విషాదంలో మునిగిపోయింది.