1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (15:17 IST)

అక్కతో లగ్నం... పెళ్లిపీటలపై ఒత్తిడితో చెల్లినికూడా పెళ్లాడిన వరుడు...

కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ యువకుడికి అదృష్టం అలా కలిసివచ్చింది. అక్కా చెల్లెళ్లను ఒకే వివాహా వేదికపై పెళ్లాడాడు. అదీకూడా అక్క ఒత్తిడితో చెల్లిని కూడా పెళ్లి చేసుకోవడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని తిమ్మరావుతనహళ్ళి గ్రామ పంచాయతీ వేగమడుగు గ్రామానికి చెందిన రాణెమ్మ, నాగరాజప్ప రైతు దంపతుల కుమార్తెలు సుప్రియ, లలిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్న కుమార్తె లలిత మూగ, బధిర యువతి. దీంతో ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారనే బెంగ అక్క సుప్రియకు పట్టుకుంది. 
 
ఈ క్రమంలో సుప్రియకు బాగేపల్లికి చెందిన ఉమాపతి అనే యువకునితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 7వ తేదీన పెళ్లి మండపంలో వరుడు తాళి కట్టబోతుండగా సుప్రియ తన ఆలోచనను చెప్పింది. చెల్లిని కూడా నీవు పెళ్లాడితే కానీ ఈ వివాహం జరగదని మొండికేయడంతో పెద్దల అనుమతితో ఉమాపతి ఇద్దరికీ మాంగళ్యధారణ చేశాడు. 
 
ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూడగా సోషల్‌ మీడియాలో ఇద్దరు భామల ముద్దుల మొగుడు వైరల్‌ అవుతున్నాడు. మరోవైపు వధువు లలితకు ఇంకా 18 ఏళ్లు దాటలేదని తెలియడంతో శిశు సంక్షేమ, పోలీసు అధికారులు వచ్చి వరుడు సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.