1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (16:12 IST)

బీజేపీ ఎమ్మెల్యేలను తరిమికొట్టిన గ్రామస్థులు

దేశంలోని అతిపెద్ద రాష్ట్రంగా ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి తర్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టి ఈ రాష్ట్రంలోనే కేంద్రీకృతమైవుంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ఈ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ విపక్ష నేతలు ప్రచారం చేస్తున్నాయి. దీనికి నిదర్శనంగా ఓ సంఘటన ఒకటి జరిగింది. 
 
బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ షైనీ ఒక గ్రామంలో పర్యటించేందుకు వెళ్లారు. కానీ, ఆ గ్రామస్థలు ఆ ఎమ్మెల్యేను గ్రామంలో అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడుసోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ మున్వార్‌పూర్ గ్రామంలో వెలుగు చూసింది. షైనీకి వ్యతిరేకంగా నినాదాలతో రెచ్చిపోయిన గ్రామస్థులు, ఆయన గ్రామం విడిచి వెళ్లేవరకు వెనుక నుంచి తరిమికొట్టారు. గ్రామస్థుల ఆగ్రహాన్ని చూడలేక సదరు ఎమ్మెల్యే కూడా పారిపోయారు.