ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (10:24 IST)

డెంగ్యూతో గుజరాత్ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ మృతి

Asha Patel
గుజరాత్ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. మెహన్సా జిల్లా ఉంఝా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె అహ్మదాబాద్‌లో తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో వారం రోజుల పాటు చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 
 
వివరాల్లోకి వెళితే.. తన నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత అస్వస్థతకు గురై ఉంఝాలోని సువిధ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో అహ్మదాబాద్‌లోని జైడస్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.