బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (17:36 IST)

ట్రెండింగ్‌- ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై రాహుల్ గాంధీ కామెంట్స్

Rahul Gandhi_Aishwarya Rai
Rahul Gandhi_Aishwarya Rai
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "భారత్ జోడో న్యాయ యాత్ర" సందర్భంగా రాహుల్ గాంధీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ను ‘డ్యాన్సర్’ అని పిలిచారు.
 
 రాహుల్ గాంధీ తన ప్రసంగంలో నాలుగు సార్లు ఐశ్వర్య రాయ్ పేరును ప్రస్తావించారు. ఇంకా రాహుల్ గాంధీ రెండు మూడు సార్లు ఐశ్వర్య రాయ్‌పై  అవమానకరమైన పదాలను ఉపయోగించాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యా రాయ్ ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు. 
 
ఐశ్వర్యరాయ్‌పైనే కాదు రాహుల్ గాంధీ కూడా అమితాబ్ బచ్చన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 21న ఒక ప్రసంగంలో రాహుల్ గాంధీ, అమితాబ్, ఐశ్వర్యపై వివాదాస్పద కామెంట్లు చేశారు. 
 
 
 
అయోధ్య రామమందిర ప్రతిష్ఠా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అమితాబ్, ఐశ్వర్య వంటి వారిని ఆహ్వానించారని, అయితే ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ), పేదలను ఆహ్వానించలేదని రాహుల్ గాంధీ అన్నారు.
 
 
 
నరేంద్ర మోదీ ప్రభుత్వం పేరుతో ఐశ్వర్యారాయ్, అమితాబ్ బచ్చన్‌లను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీని ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. రాహుల్ గాంధీతో పాటు ఐశ్వర్యరాయ్ అత్త, రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 
 
ఇకపోతే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళలను అవమానించారని గాయని సోనా మహపాత్ర అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ కన్నడిగులను అవమానించారని ఆమె మండిపడ్డారు.