ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:14 IST)

కాంగ్రెస్ పార్టీకి కమలం ఝలక్: హరియాణలో మళ్లీ పుంజుకుంటున్న భారతీయ జనతా పార్టీ

Election Results 2024 LIVE
హరియాణలో సంబరాల్లో తేలిపోతున్న కాంగ్రెస్ పార్టీకి కమలం కాస్త ఝలక్ ఇస్తోంది. తొలుత కిందపడ్డట్లు కనిపించన భాజపా మళ్లీ పుంజుకుంది. 44 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక కౌంటింగ్ ఆరంభ ట్రెండ్స్ విషయానికి వస్తే.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 70కిపై స్థానాల్లో తొలుత ముందంజలో వున్నట్లు కనిపించినా సీన్ రివర్స్ అవుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ 44 చోట్ల ఆధిక్యంలో వుంది. భాజపా లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 45 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
 
ఇక దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు ఎన్నికలు జరుపుకున్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ బీజేపీ, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఆరంభ ట్రెండ్‌ను బట్టి అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్ కూడా కాంగ్రెస్ కూటమి 34కు పైగా స్థానాల్లో, బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
 
ఇకపోతే, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్కు ముందే సంబరాలను మొదలుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కౌంటింగ్ మొదలు కాకముందే హస్తం పార్టీ నాయకులు వేడుకలు మొదలుపెట్టారు. కాగా హర్యానా, జమ్మూ కశ్మీర్ రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ 90 సీట్లు ఉన్నాయి. మేజింగ్ ఫిగర్ 46 సీట్లుగా ఉంది.