గురువారం, 6 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 మార్చి 2025 (15:55 IST)

ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. మతం మార్చుకున్న తొలి ప్రియురాలు.. పెళ్లి చేసుకోమంటే.. ఖాళీ సిరంజీలతో?

crime
ప్రేమ పేరుతో మోసపోయే యువతుల సంఖ్య తగ్గట్లేదు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరిన పాపానికి ఆ ప్రియుడు తన ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి హత్య చేసి.. రోడ్డు పక్కన లోయలో పడేసిన ఘటన తమిళనాడు, సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చికి చెందిన అల్ఫియా, హఫీజ్ అనే వ్యక్తిని 2023 నుంచి ప్రేమిస్తోంది. అతన్ని పెళ్లి చేసుకునేందుకు మతం కూడా మారింది.
 
అయితే చెన్నైలో టెక్కీగా పనిచేసే కావ్య సుల్తానాతో హఫీజ్ సన్నిహితంగా వున్నట్లు తెలుసుకున్న అల్ఫియా.. తనను వివాహం చేసుకోవాలని బలవంతం చేసింది. మతం మార్చుకున్న తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. ఒక వైపు కావ్యతో పాటు మరో యువతి మోనీషాతో హఫీజ్ ప్రేమలో వున్నాడని తెలిసి అల్ఫియా పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతం చేసింది. దీంతో ప్రియురాళ్లతో కలిసి అల్ఫియాను హఫీజ్ హత్య చేసి.. అద్దె కారులో ఏర్కాడుకు వెళ్లి అక్కడ లోయలో పడేశారు. 
 
ఖాళీ సిరంజీలతో అల్ఫియా రక్తనాళాళ్లో గాలిని నింపడంతో రక్తప్రసరణ ఆగిపోయి ఆమె ప్రాణాలు వదిలేసింది. దీంతో ఆమె మృతదేహాన్ని లోయలో పడేసిన ఆ ముగ్గురు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.