అన్నంతపనీ జరిగింది.. ఆ జవాన్‌ని బదిలీచేశారు..
సరిహద్దుల్లో పనిచేస్తున్న భారత సైనికులకు అధికారులు నాసిరకం ఆహారం అందిస్తున్నారన ఫేస్‌బుక్‌లో సాక్ష్యాధారాలతో వీడియో అప్ లోడ్ చేసిన బీఎస్ఎఫ్ జవానును అతడి యూనిట్ నుంచి వేరొక ప్రాంతానికి అధికారులు బదిలీ చేశారు. అయితే ఆ సైనికుడు పచ్చి తాగుబోతు అని ఇప్పటి
సరిహద్దుల్లో పనిచేస్తున్న భారత సైనికులకు అధికారులు నాసిరకం ఆహారం అందిస్తున్నారన ఫేస్‌బుక్‌లో సాక్ష్యాధారాలతో వీడియో అప్ లోడ్ చేసిన బీఎస్ఎఫ్ జవానును అతడి యూనిట్ నుంచి వేరొక ప్రాంతానికి అధికారులు బదిలీ చేశారు. అయితే ఆ సైనికుడు పచ్చి తాగుబోతు అని ఇప్పటికే ఆరోపణలకు లంకించుకున్న సైన్యాధికారులు సరైన విచారణ కోసమే అతడిని బదిలీ చేశామని సమర్తనకు దిగారు.
ప్రభుత్వం తమకు కావలసిన అవసరాలను సేకరిస్తున్నప్పటికీ సైన్యంలోని ఉన్నతాధికారులు కక్కుర్తిపడి వాటని చట్టవిరుద్ధంగా అమ్ముకుంటున్నారని, తమకు పస్తులు తప్పడం లేదని బీఎస్పీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. పైగా అవినీతిని అడ్డుకోవడంలో భగత్ సింగ్ చేయలేని పని తాను చేశానని ఆ సైనికుడు తాజాగా మరో ఆడియో పోస్ట్ చేయడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారింది.
ఈలోగా జమ్మూలోని బీఎస్ఎఫ్ ఐజీ డికె ఉపాధ్యాయ్ వివరణ ఇస్తూ డిసెంబర్ 28న యాదవ్‌ని ఎల్ఓసీ వద్ద డ్యూటీకి పంపామని, చాలామంది సైనికులు లీవు పెట్టడంతో తనను అక్కడికి పంపించామని చెప్పారు. గత నాలుగేళ్లుగా ఆ సైనికుడికి ఎలాంటి ఫీల్ట్ పని ఇవ్వలేదని, హెడ్ క్వార్టర్స్ వద్దే అతడిని ఉంచామని చెప్పారు. ఫేస్ బుక్‌లో వీడియోలు పెట్టడానికి బదులు సముచితమైన సమస్యా పరిష్కార వ్యవస్థ ద్వారా అతడు ఆరోపించి ఉంటే మేము సంతోషించి ఉండేవారం. జనవరి 6న డీఐజీ ఆ యూనిట్‌ని సందర్శించాడు కానీ ఆ సైనికుడు అప్పుడు ఎలాంటి ఆరోపణా చేయకపోవడం ఆశ్చర్యం గొలిపిస్తోందని అతడి ఉద్దేశం అస్పష్టంగా ఉందని ఉపాధ్యాయ చెప్పారు.
కానీ ఒకటి మాత్రం వాస్తవం బ్రిటిష్ వారి కాలంలోనే సైన్యంలో అవినీతిని అరికట్టడం వారికి సాధ్యం కాలేదని అనేక రుజువులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు భారత సైన్యంలో అవినీతే అసలు లేదని చివరికి ప్రకటించనున్నారా అనేది సందేహం.