శనివారం, 2 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అనాసాగర్ సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2 వేల నోట్ల కట్టలు

currency notes
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఉన్న అనాసాగర్ సరస్సులో 2 వేల రూపాయల నోట్ల కట్టలు కొట్టుకునివచ్చాయి. వీటిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సరస్సులో కరెన్సీ నోట్ల కట్టలు కొట్టుకొచ్చినట్టు వార్తలు రావడం స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ నోట్ల కట్టలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అవి పూర్తిగా తడిచిపోయి ఉండటంతో వాటిని లెక్కించడం సాధ్యపడలేదని ఎస్పీ బల్దేవ్ సింగ్ తెలిపారు. అయితే, ఈ నోట్ల కట్టలను సరస్సులో ఎవరు విసిరేశారన్న అంశంపై దర్యాప్తు సాగిస్తున్నట్టు చెప్పారు. 
 
అయితే, ఈ సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2 వేల నోట్ల కట్టలు నకిలీవనే ప్రచారం సాగుతోంది. కానీ, పోలీసులు మాత్రం ఈ వార్తలను కొట్టపారేస్తున్నారు. నోట్ల కట్టలపై ఆర్బీఈ రబ్బర్ స్టాంపు కూడా ఉందని తెలిపారు ఓ పాల్తీన్ కవర్‌లో కట్టి వీటిని సరస్సులో విసిరేశారని వారు వెల్లడించారు.