శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (17:06 IST)

దాతి మహారాజ్‌పై అసహజ శృంగార కేసు .. సీబీఐ యాక్షన్

ఢిల్లీకి చెందిన వివాదాస్పద స్వామీజీ దాతి మహారాజ్‌పై అసహజ శృంగారం కేసు నమోదైంది. ఆయనపై సీబీఐ అత్యాచార కేసును నమోదు చేసింది. దక్షిణ ఢిల్లీలో దాతి మహారాజ్ ఆలయం ఉంది. ఆశ్రమంలో ఉన్న మహిళను అత్యాచారం చేశాడని ఓ మహిళా భక్తురాలు ఫతేపుర్ బేరి పోలీసు స్టేషన్‌లో దాతిమహారాజ్‌పై ఫిర్యాదు చేసింది. జూన్ 22వ తేదీన ఈ ఫిర్యాదు నమోదు చేశారు.
 
కాగా, ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ దాతి మహారాజ్‌కు ఆశ్రమాలు ఉన్నాయి. అయితే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని మహారాజ్ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో విచారణ సరిగా చేయలేదని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ వీకే రావులతో కూడిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ తీర్పునిచ్చింది.