బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (13:23 IST)

సుప్రీంలో CBSE 12th ఫలితాల వెల్లడి.. ఎలా లెక్కిస్తారంటే..?

సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల నిర్థారణ విధానాన్ని సీబీఎస్‌ఈ ప్రకటించింది. 10,11వ తరగతి మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా 30:30:40 ఫార్ములా ఆధారంగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. ఇందుకు సంబంధించిన మార్కుల ప్రణాళికను సీబీఎస్‌ఈ బోర్డు గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది.
 
 
ఇందులో 10,11 తరగతుల మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీ, 12వ తరగతిలో టెర్మ్‌ పరీక్షల నుంచి 40 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.ఈ విధానంతో సంతృప్తి చెందనివారు పరీక్షలకు హాజరుకావొచ్చని పేర్కొంది. కాగా జూలై 31లోపు సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.
 
సీబీఎస్ఈ 12వ తరగతి మార్కులు ఎలా లెక్కిస్తారంటే..? 
 
పదో తరగతి మరియు పదకొండవ తరగతి మార్కులని ఐదు పేపర్లలో మంచి పేపర్స్‌ని మూడు తీసి.. ఆ మార్కులను ఫైనల్ చేస్తారు. అదే విధంగా 12 తరగతి విషయం లోకి వస్తే.. యూనిట్, టర్మ్, ప్రాక్టికల్స్ ఆధారంగా మార్కులని ఫైనల్ చేస్తారు.
 
ఆటోని జనరల్ ఆఫ్ ఇండియా జులై 31, 2021 నెల ఫలితాలు విడుదల చేస్తామని చెప్పింది. ఏ జీకే వేణుగోపాల్ సుప్రీం కోర్టు తో మోడరేషన్ కమిటీని ఏర్పాటు చేస్తామని.. 12 వ తరగతి విద్యార్థులకు రివార్డులని ఇవ్వడం ఉంటుందని చెప్పారు. 12వ తరగతి ప్రీ బోర్డు పరీక్షల ఆధారంగా 40 శాతం మార్క్‌లను కలపనున్నట్లు బోర్డు తెలిపింది.
 
జూన్ 1న జరగవలసిన 12వ తరగతి పరీక్షలని ప్రభుత్వం రద్దు చేసిన విషయం కూడా తెలిసిందే మే జూన్ నెలలో జరగవలసిన పరీక్షలు వాయిదా అయిపోయాయి. పదో తరగతి పరీక్షలు కూడా సిబిఎస్సి రద్దు చేసేసింది.
 
11వ తరగతి పర్ఫార్మెన్స్ ఆధారంగా 30 శాతం మార్క్‌లు అలానే పదవ తరగతి ఆధారంగా 30 మార్క్‌లు ఇవ్వనున్నట్లు బోర్డు చెప్పింది. అదే విద్యార్థులు క్వాలిఫయింగ్ మార్క్‌లు రాకపోతే.. వారిని కంపార్ట్‌మెంట్ క్యాటగిరీలో వుంచాలంది. మార్క్‌లతో సంతృప్తి చెందని వారు సీబీఎస్ఈ పరీక్షలను రాసుకోవచ్చు అని అటార్నీ జనరల్ చెప్పారు