1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (12:31 IST)

బంగారు షాపులో పది లక్షల నెక్లెస్ కొట్టేసిన మహిళ.. వీడియో వైరల్

woman
woman
సెల్ ఫోన్ షాపుల్లో, బంగారు షాపుల్లో నగలను దోచుకెళ్లిన ఘటనలకు సంబంధించిన వీడియోలో ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నగల దుకాణంలో ఓ మహిళ 10 లక్షల విలువైన హారాన్ని దొంగిలించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. 
 
గోరఖ్‌పూర్‌లో నవంబర్ 17 న బల్దేవ్ ప్లాజాలోని బెచు లాల్ సరాఫా ప్రైవేట్ లిమిటెడ్ జ్యువెలరీ షాపులో ఈ సంఘటన జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో, సదరు మహిళ షాపులోని నెక్లెస్ సెట్లను చూస్తూ తన చీరలో నెక్లెస్‌ను దాచిపెట్టింది. దుకాణం యజమానులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓ నెక్లెస్‌ కనిపించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.