శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (17:32 IST)

జుజి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీతో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ దాస్ కా ధమ్కీ

Lazarov-Juji, Vishvak Sen, karate raju
Lazarov-Juji, Vishvak Sen, karate raju
విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ న‌టిస్తున్న చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫ‌ల‌క్‌నామా దాస్ త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం చేస్తున్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో కీల‌క‌మైన యాక్ష‌న్ పార్ట్‌ను శుక్ర‌వారంనాడు సార‌థిస్టూడియోస్‌లో చిత్రీక‌రిస్తున్నారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. వంటి ప‌లు చిత్రాల‌కు ప‌నిచేసిన జోజో యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ,  ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. అంద‌రూ ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమాను హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళంలో డ‌బ్ చేస్తున్నాం. ఆర్‌ఆర్‌ఆర్‌, హరి హర వీర మల్లు చిత్రాలకు  స్టెంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజి తో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్‌ లోని సారధి స్టూడియోస్‌ లో వేసిన భారీ సెట్‌ లో షూటింగ్ జరుగుతోంది.  95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు. ఫుకెట్‌ లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్‌ ను, స్పెయిన్‌ లో ఒక చిన్న షెడ్యూల్‌ ను టీమ్ పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు.
 
బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్‌ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌ ను పర్యవేక్షించారు. చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా,  లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
కరాటే రాజు  మాట్లాడుతూ..  'దాస్ కా ధమ్కీ' లో నవరసాలు వుంటాయి. భారీ బడ్జెట్ సినిమా ఇది. అద్భుతమైన కథ. ఎక్కడా రాజీ పడకుండా వున్నతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమా తీస్తున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.'' అన్నారు.
 
తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్
 
సాంకేతిక సిబ్బంది: దర్శకుడు: విశ్వక్ సేన్,  నిర్మాత: కరాటే రాజు,  బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్,  కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ,  కెమెరాః దినేష్ కె బాబు,  సంగీతం: లియోన్ జేమ్స్,  ఎడిటర్: అన్వర్ అలీ