శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (16:29 IST)

మొదటిసారిగా సితారతో కలిసి టీవీ షోలో కనిపించనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

Sitara-Mahesh Babu
ఎన్నో అద్భుతమైన రియాలిటీ షోస్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జీ తెలుగు, ఇటీవలే డాన్స్ ఇండియా డాన్స్- తెలుగు మొదటి సీసన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు బ్లాక్‌బస్టర్ లాంచ్ ఎపిసోడ్స్ ద్వారా 10 కంటెస్టెంట్ జోడీలను వీక్షకులకు పరిచయం చేసిన ఛానల్, ఇప్పుడు కాంపిటీషన్ ఫేస్‌ను మునుపెన్నడూలేని విధంగా ప్రారంభించనుంది.

 
సూపర్ స్టార్ మహేష్ బాబు కాంపిటీషన్ ఫేస్‌ను 'ఫ్లాగ్ ఆఫ్' చేయబోతుండగా, తన కూతురు సితారతో కలిసి మొదటిసారి ఒక రియాలిటీ షోలో కనిపించనున్నారు. కంటెస్టెంట్స్ మైమరపించే ప్రదర్శనలతో పాటు మహేష్-సితారలు యాంకర్స్, జడ్జెస్‌తో చేసే సందడి చూడాలంటే, సెప్టెంబర్ 4న (ఆదివారం) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ఇండియా డాన్స్ ఎపిసోడ్‌ని చూడాల్సిందే. మహేష్ బాబు తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించబోతుండగా, సితార వాళ్ళ నాన్నతో చేసే అల్లరి ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలవనుంది. అంతేకాకుండా, తన ముద్దుముద్దు మాటలతో, చక్కని డాన్స్ ప్రదర్శనతో సితార ఈ వారం 'జీ తెలుగు' ప్రేక్షకులను కనువిందు చేయనుంది.

 
కాంపిటీషన్ ఫేస్‌ను ప్రారంభించిన అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ, "సీతారకు డాన్స్ మీద ఉన్న మక్కువ నన్ను ఈ షోకి వచ్చేలా చేసింది. అంతేకాకుండా, మొదటిసారి నా కూతురితో కలిసి ఒక టీవీ షోలో కనిపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఎప్పటికి మరిచిపోలేని ఒక స్పెషల్ మూమెంట్. ఎన్నో భాషలలో సూపర్ హిట్‌గా నిలిచిన డాన్స్ ఇండియా డాన్స్ ఇప్పుడు తెలుగులో రావడం, 'జీ తెలుగు' మారుమూల గ్రామాల నుండి టాలెంట్‌ని వెలుగులోకి తేవడం అభినందనీయం. ఈ షోలో పాల్గొంటున్న ప్రతిభావంతులైన పోటీదారులందరూ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటూ తమ కళలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. ఆదేవిధంగా, ఈ షోకి తమను ఆహ్వానించిన 'జీ తెలుగు'కి ప్రత్యేక ధన్యవాదాలు," అని చెప్పారు. 

 
సితార షోలో తన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ.."నేను ఒక టీవీ షో స్టేజ్ పైకి రావడం ఇదే మొదటిసారైనప్పటికీ నాన్న నా పక్కన ఉండటం వల్ల ఎంతో సాఫీగా గడిచిపోయింది. నాకు డాన్స్ అంటే ఎంతో ఇష్టం. కంటెస్టెంట్స్ యొక్క పెరఫార్మన్సెస్ నాకు ఎంతో స్ఫూర్తిని కల్పించాయి. నా మొదటి టీవీ షో ఎక్స్పీరియన్స్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. నన్ను డాన్స్ ఇండియా డాన్స్‌కి తీసుకువచ్చిన నాన్నకి స్పెషల్ థాంక్స్," అని చెప్పుకొచ్చింది.

 
'జీ తెలుగు' చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు షోకి విచ్చేసినందుకు మహేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, "ఈ కాంపిటీషన్‌ను మహేష్ బాబు తన కూతురితో కలిసి లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాము. ఇది తప్పకుండా ఇటీవలి కాలంలో వచ్చిన అతిపెద్ద షో లాంఛ్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. డాన్స్ ఇండియా డాన్స్- తెలుగు ద్వారా 'జీ తెలుగు' అద్భుతమైన టాలెంట్ ను వెలికితీసింది. ఇక నుండి ప్రతి వారం అద్భుతమైన ప్రదర్శనలతో ఈ షో అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాము. మహేష్ బాబు తన కూతురు సితార తో కలిసి చేసిన మొట్టమొదటి టీవీ షో ఎంట్రీ ఈ కార్యక్రమానికి ఎంతో మేలుచేయడంతో పాటు వారి అభిమానులకి కన్నుల పండుగగా నిలవనుంది," అని చెప్పారు.  

 
డాన్స్ ఇండియా డాన్స్- తెలుగు ప్రసారానికి కొన్ని గంటల ముందు 'జీ తెలుగు' మరో అద్భుతమైన కార్యక్రమంతో ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇటీవలే బోనాలు ఈవెంట్‌తో అందరిని అలరించిన ఛానల్, ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ ఈవెంట్, మన ఊరి రంగస్థలంతో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వీక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. ఆ ఫెస్టివల్ ఈవెంట్‌కి శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, నటులు సుధీర్ బాబు, శ్రీ సింహ, దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, సతీష్ త్రిపుర, గాయకుడు- సంగీత దర్శకుడు కాలభైరవ ప్రత్యేక అతిధులుగా విచ్చేయనున్నారు. అంతేకాకుండా, ప్రముఖ టీవీ నటులు, కమెడియన్స్, సరిగమప కంటెస్టెంట్స్ తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు.