సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (15:39 IST)

బాలికను అలా ఈడ్చుకెళ్లారు.. వీడియో వైరల్

woman
యూపీలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా యూపీలోని బులంద్‌షహర్‌లో ఓ అమ్మాయిని బలవంతంగా ఈడ్చుకుని వెళ్లారు. ఖుర్జా నగర్‌లోని పీర్ జదంగా మొహల్లా వద్ద ఇద్దరు యువకులు ఓ యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతిని ఇద్దరు యువకులు బలవంతంగా ఈడ్చుకెళ్తున్నారు. 
 
ఖుర్జాలో నివసించే మున్నా అనే వ్యక్తిని కలిసేందుకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. తరచూ మున్నాను కలిసేందుకు వెళ్లే ఆ యువతిపై దాడి జరిగినట్లు తెలిసింది. బుధవారం రాత్రి మున్నా, ఆమె మధ్య ఏదో విషయమై గొడవపడి బాలికపై దాడి జరిగినట్లు వెల్లడి అయ్యింది. 
 
ఈ కేసులో మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి, అసభ్యకర పనులు, హత్య బెదిరింపుల కింద ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన వీడియో గురువారం రాత్రి సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైందని పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు.