శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (22:44 IST)

మోదీ సంచలన ప్రకటన.. ఉచిత రేషన్ ఐదేళ్ల పొడిగింపు

narendra modi
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఈ ప్రకటనను ప్రధాని ప్రకటించారు. 
 
కరోనా సమయంలో పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మార్చి 2020 నుంచి ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
 
ఈ నేపథ్యంలో.. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోదీ వెల్లడించారు.