1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (17:19 IST)

ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన కొత్త ఐటీ మంత్రి... మావే అత్యుత్తమ చట్టాలు

కేంద్ర ఐటీ శాఖామంత్రిగా అశ్వనీ వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పాత ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను తొలగించి, ఆయన స్థానంలో అశ్వనీ వైష్ణవ్‌ను ఐటీ మంత్రిగా చేశారు. 
 
ఆయన అశ్వనీ వైష్ణవ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రావడం రావడమే ట్విట్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. భారత భూభాగంపై రూపొందించిన చట్టాలే అత్యంత ఉన్నతమైనవని, ఖచ్చితంగా కొత్త రూల్స్‌ను పాటించాల్సిందేనని ట్విట్టర్‌కు తేల్చి చెప్పారు. 
 
కొన్ని రోజుల నుంచి నిబంధనల విషయంలో ట్విట్టర్‌కు, భారత ప్రభుత్వానికి మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని మొన్నటి వరకూ ఐటీ శాఖా బాధ్యతలు చూసుకున్న రవిశంకర్ ప్రసాద్ కూడా ట్విట్టర్‌ను మందలించిన విషయం విషయం తెలిసిందే. 
 
అయితే, రవిశంకర్ మందలింపులను ట్విట్టర్ ఇండియా యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు. పైగా, కేంద్ర వైఖరిని ట్విట్టర్‌కు తేటతెల్లం చేయడంలో రవిశంకర్ ప్రసాద్ విఫలమయ్యారనే వాదనలు విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మంత్రిపదవిని కోల్పోవాల్సి వచ్చింది.