గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (16:48 IST)

మీరు పులి... ఎప్పటికీ అలాగే ఉండాలి.. ఎన్డీయే ఫ్యామిలీలోకి స్వాగతం!!

Jitan Ram Manjhi
జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంపాయి సోరేన్ ఎన్డీయే కూటమిలో చేరనున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతుంది. దీనికి మరింతగా బలం చేకూర్చేలా కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ తన ఎక్స్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. "చంపాయి సోరేన్.. మీరు పులి. ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎన్డీయే ఫ్యామిలోకి స్వాగతం" అంటూ ట్వీట్ చేశారు. దీంతో చంపాయి సోరేన్ ఎన్డీయే కూటమిలో చేరడం ఖాయమని తేలిపోయింది. 
 
మరోవైపు, చంపాయి సోరేన్ బీజేపీతో చేతులు కలుపుతారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నందునే ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చిందన్నారు. అయితే, బీజేపీలో చేరికపై స్పష్టత ఇవ్వనప్పటికీ తన ముందు మూడు మార్గాలున్నాయంటూ సుధీర్ఘ లేఖ ఒకటి విడుదల చేశారు. 
 
ఇదిలావుంటే, హిందుస్థాన్ అవామ్ మోర్ఛా అధినేతగా మాంఝీ... ప్రస్తుతం కేంద్ర మంత్రిగా, బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ మంత్రిగా ఉన్నారు.