మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తి చేసిన చంద్రయాన్-3 : ఇస్రో ట్వీట్

vikram lander
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండ్ రోవర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్‌ ద్వారా మద్దాడేలా చేసింది. దీనిపై ఇస్రో తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు చంద్రయాన్-3 మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తి చేసిందని తెలిపింది. సాఫ్ట్ ల్యాండింగ్, జాబిల్లిపై రోవర్ సంచారం విజయవంతంగా ముగిసిననట్టు తెలిపింది. ప్రస్తుతం జాబిల్లిపై ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించింది. రోవర్‌లో ఉన్న అని వ్యవస్థలు సాఫీగా పని చేస్తున్నాయని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. 
 
"చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం, జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరించడం దిగ్విజయంగా పూర్తయింద"ని తెలిపింది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా, జాబిల్లి ఉపరితలంపై ప్రస్తుతం పలు ప్రయోగాలు జరుగుతున్నాయని, అన్ని వ్యవస్థలూ ఆశించిన స్థాయిలో పనితీరును కనబరుస్తున్నాయని ప్రకటించింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌తో భారత్ జాబిల్లి దక్షిణ ధృవంపై వ్యోమనౌక నిలిపిన తొలి దేశంగా బుధవారం ఓ అరుదైన రికార్డున సృష్టించిన విషయం తెలిసిందే.