శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

నిలిచిన ఛార్‌దామ్ యాత్ర... భక్తులను శ్రీనగర్‌లో నిలిపివేత

char dham yatra
ఛార్‌దామ్ యాత్ర నిలిచిపోయింది. ఓ వైపు వర్షం, మరోవైపు విపరీతమైన మంచు కురుస్తుండటంతో యాత్ర ఆగిపోయింది. అధికారులు యాత్రికులను శ్రీనగర్‌లో నిలిపివేశారు. ఉత్తరాఖండ్ ఎన్.ఐ.టి, బద్రీనాథ్ బస్టాండ్ ఏరియాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలను నియంత్రిస్తున్నారు. 
 
వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో భక్తుల రక్షణ నిమిత్తం ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా యాత్రికులను పోలీసు అధికారులు శ్రీనగర్‌లోనే నిలిపివేశారు. రాత్రిపూట బస ఏర్పాట్లను ముందే ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకున్న వారిని మాత్రమే రుద్రప్రయాగ్ వరకు అనుమతిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన వారంతా శ్రీనగర్‌లోనే ఉండాలని ఆదేశించారు.
 
యాత్రికుల భద్రత దృష్ట్యా వాతావరణం క్లియర్ అయ్యేంత వరకు ముందుకు అనుమతించలేమని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం శ్రీనగర్‌లో ఛార్ దామ్ యాత్రికులు ఎక్కువగా ఆగే ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.