మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (20:14 IST)

15 ఏళ్ల బాలికపై 63 ఏళ్ల వ్యక్తి.. గర్భం దాల్చడంతో...

rape
63 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్​కు తీసుకెళ్లారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. బాలిక ఇంట్లోనే అద్దెకు వుంటున్న ఈ పెద్ద మనిషి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. మెడికల్​ టెస్ట్​ల తర్వాత ఆ బాలిక ప్రెగ్నెన్సీ అన్న విషయం బయటపడింది. దీంతో డాక్టర్​, ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కంప్లెయింట్​ చేశారు. 
 
దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లైంగిక నేరాల నుంచి బాలల నిరోధక చట్టం (పోక్సో) కింద అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని శుక్రవారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.